ఉపాధి వేటలో ఆగిన ఊపిరి
మల్లాపూర్(కోరుట్ల): ఉన్న ఊరిలో ఉపాధి కరువై, కుటుంబాన్ని వదిలి ఏడారి దేశానికి వెళ్లిన ఓ వలసజీవి అక్కడే మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మల్లాపూర్ మండలంలోని రేగుంటకు చెందిన కర్న గణేశ్(55)కు భార్య రాజేశ్వరి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గణేశ్ ఉపాధి నిమిత్తం కొన్నేళ్లుగా సౌదీ అరేబియా వెళ్లొస్తున్నాడు. అక్కడ దర్జీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కూతుళ్లకు వివాహాలు జరిపించాడు. కొంత అప్పు ఉండటంతో ఇటీవలే సౌదీ వెళ్లాడు. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో మృతిచెందాడు. అతని వెంట ఉన్నవారు ఈ విషయాన్ని శుక్రవారం ఫోన్‌లో తెలుపడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గణేశ్ మృతదేహం స్వగ్రామం చేరేలా చూడాలని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
సౌదీలో గుండెపోటుతో రేగుంటవాసి మృతి
Comments
Please login to add a commentAdd a comment