ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
విద్యానగర్(కరీంనగర్): తనకు విధులు కేటాయించడం లేదని మనస్తాపానికి గురైన ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడి వివరాల ప్రకారం.. చొప్పదండి మండలంలోని చాకుంటకు చెందిన సురేశ్ ఆర్టీసీ కరీంనగర్–1 డిపోలో అద్దె బస్సు డ్రైవర్‌గా పని చేసేవాడు. గత సెప్టెంబర్‌లో మద్యం సేవించి, టెస్టింగ్‌లో దొరికిపోయాడు. దీంతో అధికారులు అతన్ని పక్కన పెట్టారు. 6 నెలలు గడిచినా విధులు కేటాయించకపోవడంతో సురేశ్ మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం డిపో ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకొని, పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై వారు కేసు నమోదు చేశారు.
6 నెలలుగా విధులు కేటాయించకపోవడమే కారణం
Comments
Please login to add a commentAdd a comment