పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
కరీంనగర్: ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్‌ఆర్‌ఎస్‌పై కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ నుంచి కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలో ఇంటర్ పరీక్షలు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మొదటి సంవత్సరంలో 17,799మంది, రెండో సంవత్సరంలో 17,763 మంది మొత్తం 35,562 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇందుకుగాను జిల్లాలో 37సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్స్, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, డీఐఈవో జగన్మోహన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఇంటర్ ఎగ్జామ్ కమిటీ మెంబర్లు ఆంజనేయరావు, సత్యవర్ధన్‌రావు, మధుమోహన్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment