హక్కుల సాధనకు మహాసభలు
● అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి
కరీంనగర్: పద్మశాలీల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు మహాసభలు ఏర్పాటు చేయడం జరిగిందని అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామార్తపు మురళి పేర్కొన్నారు. కరీంనగర్ పద్మశాలి సంక్షేమ ట్రస్ట్‌భవన్‌లో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు మిర్చి సత్యం అధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ పద్మశాలీలు చట్టసభల్లో రాణించేందుకు 17వ అఖిలభారత పద్మశాలీ మహాసభతో పాటు 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలీ సంఘం మహాసభలను హైదరాబాద్‌లోని పద్మశాలీ భవన్ నారాయణగూడలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మార్చి 9న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో లక్ష మందితో పద్మశాలీ మహాసభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలీ కులస్తులు కదిరి రావాలని పిలుపునిచ్చారు. అ నంతరం పద్మశాలీ మహాసభ పోస్టర్ ఆవిష్కరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీరా ములు, రామచంద్ర రావు, వాసాల రమేశ్, మెతుకు సత్యం, వల్లాల కృష్ణహరి, అల్స భద్రయ్య, మార్త ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment