● ఆలోచనలు.. ఆవిష్కరణలు ● ఇన్‌స్పైర్ మనక్‌లో ప్రదర్శనలు
● ప్రయోగాలతో సత్తాచాటుతున్న విద్యార్థులు ● నేడు జాతీయ సైన్స్ దినోత్సవం
ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే జరుపుకుంటారు. సీవీ రామన్ 1928లో ఆవిష్కరించిన ‘రామన్ ఎఫెక్ట్’ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని సంపాదించిపెట్టింది. సైన్స్ రోజువారీ జీవితంలో దాని అనువర్తనాలను ప్రోత్సహిస్తుంది. ఆవిష్కరణ, శాసీ్త్రయ పరిశోధన రంగాలను కొనసాగించడానికి యువ మనస్సులను ప్రోత్సహిస్తుంది. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో, స్థిరమైన అభివృద్ధిని సాధించడంలో సహాయపడుతుంది.. ఇలా చెప్పుకుంటు పోతే సైన్స్
జీవిత గమనంలో ఒక భాగం. సైన్స్ లేనిదే మానవ మనుగడ కూడా లేదంటారు. అందుకే
ఏటా సైన్స్ దినోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తారు. పిల్లలకు సైన్స్‌పై అవగాహన కల్పిస్తారు. వారిలో ఉన్న మేధాశక్తిని వెలికితీసేందుకు సైన్స్ పోటీలు నిర్వహిస్తారు. కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సైన్స్‌ఫేర్‌లు, ఇన్‌స్పైర్ అవార్డులు తదితర వాటిని నిర్వహిస్తాయి.
నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కథనం.
Comments
Please login to add a commentAdd a comment