ముత్తారం(మంథని): ఖమ్మంపల్లిలో ఇసుక, మట్టి అక్రమంగా తరలిపోతోంది. మానేరు సరిహ ద్దు గుట్ట, ప్రభుత్వ భూమిలో ఎర్రమట్టితోపాటు ఇసు రవాణా చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా.. మైనింగ్, రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టా భూమిలోంచి మట్టి తీస్తే అనుమతి కావాలంటున్న అధికారులు.. అక్రమ రవాణాపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ మధూసూదన్‌రెడ్డిని వివరణ కోరగా, అక్రమ రవాణా విషయం తమ దృష్టికి వచ్చిందని, అక్రమార్కులపై చర్యల కోసం మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.