కరీంనగర్: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఈనెల 23న కరీంనగర్‌కు రానున్నారని, కొండ సత్యలక్ష్మి గార్డెన్‌లో జరిగే బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేటీఆర్, హరీశ్‌రావు పర్యటనను జయప్రదం చేయాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, నారదాసు లక్ష్మణరావు, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, శ్యాంసుందర్ రెడ్డి, కాసరపు శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
జిల్లాజైలును సందర్శించిన సీపీ
కరీంనగర్‌క్రైం: సీపీ గౌస్‌ఆలం బుధవారం జిల్లా జైలును సందర్శించారు. జైలులోని పరిశ్రమలు, ఉత్పత్తులు, తయారీ కేంద్రాలను పరిశీ లించారు. వంటశాల, క్యాంటీన్, ఫోన్ సౌకర్యం, ములాఖత్, లైబ్రరీ, బ్యారక్ గదులు, ఆసుపత్రి, మహిళా జైలు గురించి అడిగి తెలు సుకున్నారు. పెట్రోల్ బంక్ ద్వారా ప్రజలకు సమర్థవంతంగా సేవలందిస్తున్నందుకు జైలు అధికారులను అభినందించారు. జైలు సూపరింటెండెంట్ జి.విజయడేని, మెడికల్ ఆఫీసర్ వేణుగోపాల్, జైలర్ బి.రమేశ్, డిప్యూటీ జైలర్లు శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రమేశ్, అజయ్‌చారి పాల్గొన్నారు.
నల్లానీరు వృథా చేయొద్దు
కరీంనగర్ కార్పొరేషన్: నల్లానీరు వృథాగా వదిలేస్తే చర్యలు తీసుకుంటామని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ నగరవాసులను హెచ్చరించారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను పరిశీలించారు. పలు ఇళ్లలోకి వెళ్లి నల్లానీటి పరిస్థితిపై ఆరా తీశారు. నల్లాలకు ఆన్ ఆఫ్ బటన్ లేకుండా నీళ్లు వృథాగా పోతుండడాన్ని, విద్యుత్ మోటార్లు అమర్చి నీటి చౌర్యానికి పాల్పడుతుండడాన్ని పరిశీలించారు. రాంనగర్ వాటర్ ట్యాంక్‌లో తాగునీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరపాలకసంస్థ నల్లాలకు తప్పకుండా ఆన్ ఆఫ్ బటన్లు అమర్చుకోవా లని సూచించారు. ప్రస్తుతం వేసవి సీజన్ కాబట్టి నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. నల్లా నీటిచౌర్యం చట్టరీత్యా నేరమని, విద్యుత్ మోటార్లు అమర్చి నీటిచౌర్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలుంటాయన్నారు. సరఫరా సమయంలో సంబంధిత లైన్‌మెన్, ఫిట్టర్, ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
100శాతం సాధించారు
హుజూరాబాద్/జమ్మికుంట: జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించారు. 100శాతం పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిపారు. హుజూరాబాద్‌లో వందశాతం పన్నులు వసూలు చేసినట్లు ము న్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. ఉద్యోగులు, వార్డు ఆఫీసర్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం ద్వారా 15 రోజుల వ్యవధిలో 100శాతం పన్ను వసూళ్లు పూర్తి చేశామన్నారు. 30 వార్డుల్లో 8,917 నివాసాలకు గాను రూ.2.64 కోట్లు వసూలైనట్లు తెలిపారు. పోలీస్‌శాఖ నుంచి రూ.5.41 లక్షలు, కోర్టు బిల్డింగ్‌ల ద్వారా రూ.3.80 లక్షలు, ఎంపీడీవో కార్యాలయం ద్వారా రూ.1.18 లక్షలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రూ.1.18 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. అనంతరం సిబ్బందితో కలిసి కేక్‌కట్ చేశారు. మేనేజర్ రావుల భూపాల్‌రెడ్డి, ఏఈ సాంబరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిషన్‌రావు పాల్గొన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో వందశాతం పన్ను వసూళ్లు జరిపినట్లు కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలి పారు.సహకరించిన పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మేనేజర్ రాజిరెడ్డి, ఏఈ నరేశ్, టీపీవో శ్రీధర్, జేఏవో రాజశేఖర్ పాల్గొన్నారు.
23న కేటీఆర్, హరీశ్‌రావు రాక
23న కేటీఆర్, హరీశ్‌రావు రాక