కరీంనగర్ అర్బన్: గణాంక మదింపులో పక్కాగా వ్యవహరిస్తేనే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని ముఖ్య ప్రణాళిక అధికారి పి.దశరథ్ అన్నారు. మంగళవారం స్థానిక గణాంక భవన్‌లో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించగా అనంతరం గ్రామపంచాయతీ అకౌంట్స్, మండల ప్రజాపరిషత్ అకౌంట్స్‌పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని మండల ప్రణాళిక, గణాంక అధికారులతో పాటు సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. రెవెన్యూ విలేజ్, నీటి వనరుల వారీగా పంటలు, విత్తిన విస్తీర్ణ వివరాలపై చర్చించారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి
హుజూరాబాద్: రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ హుజూరాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వన్‌నేషన్– వన్ ఎలక్షన్‌పై వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వన్ నేషన్– వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) దేశానికి ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 హామీలు, అడ్డగోలు వాగ్దానాలతో ప్రజలను నయవంచనకు గురి చేస్తోందన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, సబ్బని రమేశ్, బోరగాల సారయ్య, గంగిశెట్టి ప్రభాకర్, రావుల వేణు, అంకటి వాసు, యాంసాని శశిధర్, యాళ్ల సంజీవరెడ్డి, కొలిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘సునీల్‌రావుతో సంజయ్ అప్రమత్తంగా ఉండాలి’
కరీంనగర్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ర్యాలీకి యువత నుంచి వచ్చిన అపూర్వ స్పందన చూసి ప్రతిపక్ష నాయకులు తడబడిపోయారని బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. మంగళవారం 37వ డివి జన్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కేటీఆర్‌ను విమర్శించే స్థాయి మాజీ మేయర్ సునీ ల్‌రావుకు లేదన్నారు. సునీల్‌రావు అవినీతి పరుడని, కేంద్రమంత్రి సంజయ్ అప్రమత్తంగా ఉండాలన్నారు. కరీంనగర్ అభివృద్ధి పూర్తి గా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ల నేతృత్వంలోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ సహకారం ఏమాత్రం లేదని విమర్శించారు. 15 నెలలుగా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కోసం ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై బండి సంజయ్‌కి మాట్లాడే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్‌రెడ్డి, నగర యూత్ ప్రధాన కార్యదర్శి బోనకుర్తి సాయికృష్ణ, నగర మైనార్టీ అధ్యక్షుడు షౌకత్, నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొంకూరి మోహన్ పాల్గొన్నారు.
‘ఆరోగ్య మహిళ’ను సద్వినియోగం చేసుకోవాలి
కరీంనగర్‌టౌన్: మహిళల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్యమహిళ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరు సద్విని యోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు. బుట్టి రాజారాంకాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న ఆరోగ్యమహిళా హెల్త్‌క్యాంప్‌ను మంగళవారం పరిశీలించారు. మందులు, రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రతీ మహిళకు అన్ని అనారోగ్య సమస్యలకు పరీక్షలు చేసి, మందులు అందించడం జరుగుతోందన్నారు. తీగలగుట్టపల్లి బస్తీ దవాఖానా ఆరోగ్య మహిళా హెల్త్‌క్యాంపును తనిఖీ చేశారు. వైద్యులు సల్మా, లావణ్య, డీపీవో స్వామి తదితరులు పాల్గొన్నారు.
పక్కా గణాంక మదింపుతోనే మెరుగైన ఫలితాలు