
ఆరోగ్యం.. విద్యపై శ్రద్ధ చూపాలి
తిమ్మాపూర్: ఆరేళ్లలోపు చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మండలంలోని పర్లపల్లిలో మహిళాభివృద్ధి శిశు,సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలు, పిల్లల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఆరేళ్లలోపు చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా గ్రామంలోని మహిళలందరూ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్య మహిళ పరీక్షల ద్వారా ప్రమాదకర వ్యాధులను ముందుగా గుర్తించి నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో రక్తహీనత సమస్యను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పేర్కొన్నారు. సభ అనంతరం గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సబిత, డీఎంహెచ్‌వో వెంకటరమణ పాల్గొన్నారు.
● కలెక్టర్ పమేలా సత్పతి