
మత సామరస్యానికి ప్రతీక లొంకకేసారం
రామగిరి(మంథని): లొంకకేసారం గ్రామంలోని ఆంజనేయస్వామి అలయంలో ఆదివారం శ్రీసీతారామ కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆరేళ్లుగా ఏటా ముస్లింల సహకారంతో రాములోరి కల్యాణం ఘనంగా నిర్వహిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ లొంకకేసారం తొలిసర్పంచ్‌గా ఎన్నికై న ఎండీ మంజూర్ అన్నీతానై స్వామివారల వివాహం జరిపించడం విశేషం. గ్రామస్తులతో కలిసి కల్యాణాన్ని వీక్షిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. చిన్నగ్రామమైనా.. మతాలకు అతీతంగా కల్యాణం జరుపుతుండడంతో గ్రామస్తుల్లో మతసామరాస్యం వెల్లివిరుస్తోంది.
హిందు సంప్రదాయ పండుగలకు ముస్లింల సహకారం
ఆరేళ్లుగా ఏటా వైభవంగా రాములోరి కల్యాణం నిర్వహణ