
‘ఎస్‌ఆర్’ ప్రభంజనం
తిమ్మాపూర్: ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లాలోని ఎస్‌ఆర్ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ సెకండియర్‌లో ఎంపీసీలో 45 మంది 990 మార్కులకుపైగా సాధించారు. బైపీసీలో నలుగురు 990కిపైగా మార్కులు సాధించారు. ఫస్టియర్ ఎంపీసీలో 63 మంది 465 మార్కులకుపైగా సాధించారు. బైపీసీలో 435 మార్కులకుపైన సాధించి ముగ్గురు విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎంపీసీ సెకండియర్‌లో కాసర్ల భవాని, అబ్దుల్ రయాన్ 994 మార్కులు, సింధూజ 993 మార్కులు సాధించగా, 992 మార్కులు 16మంది సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సరంలో బి.సహస్ర 993మార్కులు, కదిరి స్ఫూర్తి, కొత్తపల్లి జాహ్నవి 992మార్కులు, నాదే పూజిత 991మార్కులు సాధించారు. ఎంపీసీ ఫస్టియర్‌లో బండి ప్రతిష్ట, మండలోజి వైశాలిని 468 మార్కులు, ఏడుగురు 467 మార్కులు సాధించారు. బైపీసీ ఫస్టియర్‌లో హజామా హవీన్ 436 మార్కులు, దాడి శివాని, కీర్తన, వాసవి 435మార్కులు సాధించారు. వీరిని జోనల్ ఇన్‌చార్జి తిరుపతి, విద్యాసంస్థలు చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, డీజీఎం వాసుదేవరెడ్డి అభినందించారు.