
రామయ్య హుండీ ఆదాయం రూ.20,69,829
ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల హుండీ ఆదాయాన్ని మంగళవారం ఇన్‌చార్జి ఈవో సుధాకర్, దేవాదాయ పరిశీలకుడు సత్యనారాయణ, కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తంగా రూ.20,69,829 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఇందులో బంగారం 12గ్రాములు, వెండి 305గ్రాములు, అమెరికన్ డాలర్లు 225, అరబ్ దిరమ్స్ 15, కువైట్ దినర్ 1, చైనీస్ యువాన్ 5, జపనీస్‌యెన్ 1000 వచ్చాయన్నారు. గతేడాది కన్నా ఈసారి సుమారు రూ.3లక్షల ఆదాయం అధికంగా సమకూరిందని ఇన్‌చార్జి ఈవో సుధాకర్ తెలిపారు.
రెడ్డిసంఘం జిల్లా అధ్యక్షుడిగా గంగిరెడ్డి
కరీంనగర్‌టౌన్: ఆల్ ఇండియా రెడ్డిసంఘం జిల్లా అధ్యక్షుడిగా గంగాధర మండలం మంగపేట గ్రామానికి చెందిన బైరి గంగిరెడ్డిని నియమిస్తూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బీరెడ్డి కరుణాకర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గుజ్జుల రవీందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గంగిరెడ్డి మాట్లాడుతూ... రెడ్డీల సంక్షేమం కోసం పాటుపడతానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన సంఘం కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
యశోద ఆస్పత్రిలో అరుదైన వాస్క్యులర్ సర్జరీ
కరీంనగర్‌టౌన్: సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యంత అరుదైన వాస్క్యులర్ సర్జరీ నిర్వహించినట్లు ఆసుపత్రి వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ డి.ప్రభాకర్ తెలిపారు. మంగళవారం కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్‌లో మాట్లాడుతూ... హన్మకొండ జిల్లా ఎల్కతుర్తికి చెందిన కృష్ణమూర్తి(52) ఎడమకాలి వాపు, నొప్పి, పాదంలో పుండు వంటి సమస్యలతో తమ వద్దకు వచ్చాడని తెలిపారు. వెంటనే సమస్యను గుర్తించి సీటీ లోయర్ లింబ్ యాంజియోగ్రఫీ ద్వారా రక్తనాళాలలో అడ్డంకులు (పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్) ఏర్పడడంతో రక్తప్రసరణ నిలిచిపోయినట్లు గుర్తించామన్నారు. యశోద ఆసుపత్రి ఉత్తమమైన వైద్యుల బృందం, సాంకేతిక పరిజ్ఞానంతో స్టెంటింగ్, యాంజియోప్లాస్టీ ద్వారా సమర్థవంతమైన శస్త్రచికిత్స చేసి తిరిగి రక్త ప్రసరణను సాధారణ స్థితికి తీసుకువచ్చామన్నారు. కాళ్లలో వాపు, నొప్పి, వేళ్లు మొద్దుబారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు.

రామయ్య హుండీ ఆదాయం రూ.20,69,829

రామయ్య హుండీ ఆదాయం రూ.20,69,829