
అనుమానాస్పద స్థితిలో నర్స్ మృతి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ సిటీలోని జ్యోతినగర్‌లో నివసిస్తున్న ఓ నర్స్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన బాసిల్లి ఝాన్సీ(23) స్థానికంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. ఇద్దరు స్నేహితులతో కలసి జ్యోతినగర్‌లోని ఓ గదిలో కిరాయికి ఉంటుంది. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోపల ఝాన్సీ ఉండగా ఆమె స్నేహితులు బిల్డింగ్‌పై పడుకోవడానికి వెళ్లారు. అదే సమయంలో వీరికి పరిచయం ఉన్న అజయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఝాన్సీకి ఫోన్‌చేస్తే లిఫ్ట్ చేయడం లేదని తెలిపాడు. వెంటే స్నేహితులు కిందికి వచ్చి చూడగా ఝాన్సీ అపస్మారక స్థితిలో ఉంది. పక్కనే ఓ ఇంజెక్షన్ ఉండడంతో దానిని ఫొటోతీసి అజయ్‌కు పంపించారు. దీంతో అజెయ్ వెంటనే తన మిత్రుడికి సమాచారం ఇచ్చి స్నేహితులతో ఝాన్సీని ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉరేసుకుని ఆర్‌ఎంపీ ఆత్మహత్య
మేడిపల్లి: మేడిపల్లి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ సాంబారు జగదీశ్(44) శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగదీశ్ మూడేళ్లనుంచి తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నాడు. నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. అయిన మెడ నొప్పి తగ్గ్గలేదు. ఆపరేషన్ కోసం రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. ఆర్థిక పరిస్థితి, అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని చనిపోయాడు. జగదీశ్‌కు భార్య రూప, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

అనుమానాస్పద స్థితిలో నర్స్ మృతి