యలహంక పీఎస్ ముందు ధర్నాకు దిగిన బీజేపీ కార్యకర్తలు
బనశంకరి: శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో యలహంకలో కిడ్నాప్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. యలహంక జేడీఎస్ అభ్యర్థి మునేగౌడ తనను కిడ్నాప్ చేసి గొడవ సృష్టించే పథకం వేసిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో భారీ చర్చకు దారితీసింది. జేడీఎస్ అభ్యర్థి మునేగౌడ సెల్ఫ్ కిడ్నాప్‌పై గుర్తు తెలియని వ్యక్తులతో చర్చించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వచ్చింది.
బీజేపీ అభ్యర్థి కిడ్నాప్ చేసినట్లు గొడవ సృష్టించడానికి పథకం పన్నినట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై యలహంక బీజేపీ అభ్యర్థి ఎస్‌ఆర్.విశ్వనాథ్ యలహంక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఇది ఎన్నికల కుట్ర అని ప్రస్తావించారు. బీజేపీ కార్యకర్తలు అన్ని పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాకు దిగి మునేగౌడ అబద్ధపు ఆరోపణలతో కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment