
ప్రచారసభలో మాట్లాడుతున్న కార్తీక్ ఘోర్పడే
బళ్లారి రూరల్: సండూరు బీజేపీ అభ్యర్థి శిల్పారాఘవేంద్రను గెలిపిస్తే తాలూకాలో ఏళ్లతరబడి అటవీ భూములను సాగు చేసుకొంటున్న రైతులకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పట్టాలను పంపిణీ చేస్తామని బీజేపీ ప్రముఖుడు కార్తీక్ ఘోర్పడే తెలిపారు. గురువారం వేణివీరాపురంలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూడు సార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏళ్ల తరబడి అటవీ భూములను సాగు చేసుకొనే రైతులకు పట్టాలు ఇప్పించలేక పోయారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తుకారాం వల్ల ప్రజలకు ప్రయోజనం ఏమీ కలుగలేదన్నారు. 2018లో బీజేపీ తరఫున పోటీ చేసిన రాఘవేంద్ర కరోనాతో మృతి చెందడంతో ఈ సారి ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడి శిల్పారాఘవేంద్రకు సీటు ఇప్పించామన్నారు. రాష్ట్రంలో ఏకై క బీజేపీ ఎస్సీ మహిళా అభ్యర్థిని శిల్పారాఘవేంద్ర అన్నారు. ఈసారి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. ప్రచారంలో వేణివీరాపురం బీజేపీ ప్రముఖుడు ఆనంద్‌గౌడ, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment