
మోరీలోకి దూసుకెళ్లిన బస్సు
సోమందేపల్లి: పుట్టపర్తి జిల్లా పెనుకొండ పరిధిలోని సోమందేపల్లిలోని మణికంఠ కాలనీ వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న మోరీని బస్సు ఢీ కొట్టింది. కర్నూలు జిల్లా శ్రీశైలం నుంచి బెంగళూరుకు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ లగ్జరీ బస్సు అదుపు తప్పి మోరీని ఢీకొని కొంతభాగం దూసుకుపోయింది. 11 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఆ సమయంలో దాదాపు 40 మంది దాకా ప్రయాణికులు అందులో ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రయాణికులు సీట్లకు కొట్టుకుని గాయపడ్డారు. పోలీసులు వచ్చి 108 వాహనంలో పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సును పోలీసులు స్టేషన్‌కు తరలించారు. దీంతో ప్రయాణికులు వేరే బస్సుల్లో బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment