సాక్షి, బెంగళూరు: చిన్నపాటి అనారోగ్య సమస్యతో సీఎం సిద్దరామయ్య విశ్రాంతి తీసుకుంటున్నారు. బడ్జెట్ సమర్పణకు ముందే ఆయన జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. శనివారం సీఎం ఎవరినీ కలవలేదు. ఆయన భేటీ కోసం వచ్చిన అధికారులు, నాయకులు వెనుతిరిగి వెళ్లారు. అంతేకాకుండా సీఎం కార్యక్రమాలన్నీ రద్దు చేసినట్లు తెలిసింది. వాతావరణ మార్పుతో ఆయనకు జలుబు వచ్చింది.
యువశక్తి వృథా కాకుండా నైపుణ్య శిక్షణ: సీఎం
ప్రభుత్వ భూమి అక్రమణపై సర్వే చేయించి, పేదలకు భూమి పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య తెలిపారు. శుక్రవారం దేవరాజ అరసు భవనంలో జనమన ప్రతిష్ఠాన, సమతా అధ్యయన కేంద్రం చేపట్టిన చర్చాగోష్టిలో పాల్గొని మాట్లాడారు. యువత శక్తి, చైతన్యం దుర్వినియోగం కారాదని, ఇందుకోసం నైపుణ్య శిక్షణతో పాటుగా నిరుద్యోగ యువతకు 24 నెలలపాటు యువనిధి ఇవ్వటానికి నిర్ధారించామన్నారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమై వారికి ఎలాంటి నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమనే విషయంపై చర్చించినట్లు తెలిపారు. ఆమేరకు విద్యావిధానాన్ని రూపొందిస్తామన్నారు. శరావతి వరద బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.
వందేభారత్ రైలుపై రాళ్లు
దొడ్డబళ్లాపురం: వందేభారత్ రైలుపై దుండగులు రాళ్లు రువ్వారు. శుక్రవారం మధ్యాహ్నం మైసూరు నుంచి బెంగళూరు సంచరిస్తున్న రైలుపై రామనగర తాలూకా వడేరహళ్లి వద్ద గుర్తు దుండగులు రాళ్లు రువ్వడంతో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలాన్ని మండ్య రైల్వే పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment