దర్శనానికి వచ్చి.. నదిపాలు
● కావేరిలో మునిగి ఇద్దరు మహిళల మృతి
మండ్య: కావేరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు మహిళలు నదిలో మునిగి మరణించారు. మండ్య జిల్లా మళవళ్ళి తాలూకాలోని ముత్తత్తిలో ఈ విషాదం జరిగింది. కనకపుర తాలూకాలోని గాణాలు గ్రామానికి చెందిన వడివేలు కుమార్తె నదియా (19), మురళి భార్య శోభ(23) ముత్తత్తి ఆంజనేయస్వామి ఆలయం దర్శనానికి వచ్చారు. వారితో పాటు సుమారు 50 మంది గ్రామస్తులు వచ్చారు. కావేరి నదిలో స్నానం చేయడానికి దిగిన సమయంలో అనుకోకుండా లోతైన చోట జారిపడిపోయారు. కొంతసేపటికే నీట మునిగి చనిపోయారు. హలగూరు పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకి తీసి ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ నదిలో స్నానం చేస్తూ గతంలో కూడా కొందరు మరణించారు. రక్షణ చర్యలు చేపట్టి ప్రాణాలను కాపాడాలని పలువురు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment