● మహిళా ఐపీఎస్‌లు రూప, వర్తిక గొడవ
శివాజీనగర: కర్ణాటక పోలీస్ శాఖలో ఇద్దరు సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారుల మధ్య గొడవ మొదలైంది. అంతర్గత భద్రతా విభాగం ఐజీపీ డీ.రూపా మౌద్గిల్ పలు దాఖలాలను దొంగిలించారంటూ ఆ విభాగంలోని డీఐజీ వర్తికా కటియార్ ఫిర్యాదు చేశారు. వీరిద్దరి మధ్య కొన్ని రోజుల నుంచి లడాయి సాగుతోంది. అయితే సీనియర్ ఐపీఎస్‌లు ఇద్దరికీ సర్దిచెప్పారు. అంతలోనే మళ్లీ రగుల్కొంది. రూపాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్‌కు వర్తిక ఫిర్యాదు చేశారు. రూపా సిబ్బంది ద్వారా కొన్ని దాఖలాలను దొంగిలించారు. వాటి ద్వారా నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆమె పంపిన ముగ్గురు సిబ్బంది పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి తాళాలు తీసుకుని నా గది తెరిచి పలు దాఖలాల ఫోటోలు తీసుకున్నారు. నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపించారు. గతంలో రూపా మౌద్గిల్‌కు, ఐఏఎస్ రోహిణి సింధూరికి మధ్య గొడవ జరిగి సుప్రీంకోర్టుకు చేరడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment