దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 ఏళ్ల లోపు పిల్లలను చేర్చుకునేది లేదు. ఆరేళ్లు నిండిన పిల్లలకు మాత్రమే చేర్చుకోవాలని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం రాజీ పడదన్నారు. కొందరు కోర్టుకు వెళ్లినా కోర్టు తిరస్కరించిందన్నారు. 6 ఏళ్ల లోపు పిల్లలకు ఒకటవ తరగతిలో చేర్చుకుంటారని ఇటీవల వదంతులు వస్తున్నాయని, వాటిని నమ్మవద్దని అన్నారు.
కారులో మృతదేహం
యశవంతపుర: కారులో వ్యక్తి అనుమానాస్పద రీతిలో చనిపోయిన ఘటన బెంగళూరు కొడిగేహళ్లి బ్రిడ్జి వద్ద జరిగింది. మృతుడు మత్తికెరె సమీపంలోని ముత్తాలనగరకు చెందిన అశ్విన్‌కుమార్ (42). కారు తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిన అశ్విన్‌కుమార్‌కు కుటుంబసభ్యులు ఫోన్ చేసినా కలవలేదు. లొకేషన్ ట్రాక్ చేయగా బ్రిడ్జి వద్దకు వచ్చింది. అక్కడకు చేరుకుని కారు అద్దాలను పగలగొట్టి పరిశీలించగా అతడు మరణించి ఉన్నాడు. చేతిపై గాయం ఉండటంతో కుటుంసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొడిగేహళ్లి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment