విజయనగర కళా జ్వాల
హొసపేటె: విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీ ఉత్సవాలు ఆబాల గోపాలాన్నీ అలరించి ఆదివారం సాయంత్రం సమాప్తమయ్యాయి. హంపీ, కన్నడనాడు కళా వైభవాన్ని చాటేలా జానపద కళాకారుల ప్రదర్శనలు కోలాహలంగా సాగాయి. ఉద్దానం వీరభద్రేశ్వరాలయం సమీపంలోని అమ్మవార్ల విగ్రహాలకు పూజలు చేసి జానపద కళా బృందాల ఊరేగింపును ప్రారంభించారు.
గజలక్ష్మి ఆనందం
జానపద కళా బృందాల ఊరేగింపు సాంస్కృతిక సంపదను కళ్లకు కట్టింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన జానపద కళా బృందాలు కవాతులో పాల్గొని రంజింపజేశారు. హంపీలోని విరుపాక్ష ఆలయ ఏనుగు గజలక్ష్మి ఊరేగింపులో ముందుకు సాగింది. అమ్మవార్లకు దండాలు పెడుతూ, విన్యాసాలు చేస్తూ సంతోషంగా వేడుకలలో భాగమైంది. విదేశీ పర్యాటకులు కూడా ఊరేగింపులో పాల్గొన్నారు. తాషారండోల్, హలగేవదన్, వీరగాసే, నాదస్వర, పగటి వేషాలు, సింధోల్ నృత్యం, నంది ధ్వజ, ట్రంపెట్ డ్యాన్స్, మరగలు, హక్కిపిక్కీ, తోలుబొమ్మల నృత్యం ఇలా సుమారు 20కి పైగా వైవిధ్య జానపద కళాకారుల ప్రదర్శనలు మిన్నంటాయి.
ప్రతి రాయి ఒక కథ చెబుతుంది
హంపీలోని ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. చరిత్రకారులు, ప్రపంచం హంపీ గొప్పతనానికి సలాం చేస్తారని పర్యాటక మంత్రి హెచ్ కే.పాటిల్ అన్నారు. హంపీ ఉత్సవాలలో ఆయన మాట్లాడారు. హంపీ వినోద స్థలం కాదు. విజయనగర సామ్రాజ్యం సర్వవ్యాప్తంగా ఉండేది. ఈ పండుగను ఎంతో గర్వంగా జరుపుకొంటాము. ఘనమైన ప్రదేశానికి మేం వారసులం అని చెప్పారు. లక్షలాది మంది ఈ సంబరాలకు వచ్చారన్నారు. ఉత్తర కర్ణాటక గొప్ప వారసత్వ భూమి అని పేర్కొన్నారు.
మిన్నంటిన హంపీ ఉత్సవ శోభ
అమ్మవార్ల ఊరేగింపుతో సమాప్తం
Comments
Please login to add a commentAdd a comment