ఆదిలోనే సెగలు, చెమటలు
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. మూడు నెలలు ఇదేవిధంగా కొనసాగనున్నాయి. మార్చి నుంచి అధికారికంగా వేసవి ప్రారంభం అయింది. మే చివరి వరకు కొనసాగుతుంది, ఈ ఎండాకాలంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర జిల్లాల్లో ఎక్కువ
ముఖ్యంగా ఉత్తర ఒళనాడు జిల్లాలు అయిన బీదర్, కలబురిగి, రాయచూరు, యాదగిరి, విజయపుర, గదగ, బెళగావి, బాగలకోటె జిల్లాల్లో సాధారణం కంటే కూడా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీలకు సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉంది. కరావళి, దక్షిణ ఒళనాడు జిల్లాల్లో కూడా సాధారణం కంటే కూడా ఒకట్రెండు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వడగాడ్పుల హెచ్చరిక
మార్చి నుంచి మే వరకు రాష్ట్ర వ్యాప్తంగా వేడి గాలుల తీవ్రత అధికంగా ఉండనుంది. ఉత్తర ఒళనాడులోని చాలా జిల్లాల్లో వేడి గాలులు ఎక్కువగా బాధించనున్నాయి. సహజంగా సాధారణం కంటే కూడా ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగినా అధిక ఉష్ణోగ్రతలుగా రికార్డు చేస్తారు. ఒక ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదయితే వేడి గాలుల వాతావరణంగా పరిగణిస్తారు. ఏప్రిల్, మే నెలల్లో ఉత్తర ఒళనాడుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల వడగాలులు వీయనున్నట్లు వెల్లడించింది. ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ ప్రభావం రాష్ట్ర ఉత్తర జిల్లాలపై పడుతుంది.
రాష్ట్రంలో ఎండలు తీవ్రం
ప్రజల ఆపసోపాలు
ఈసారి వేసవి ఉష్ణోగ్రతలు అధికమే
ఫిబ్రవరిలో రికార్డు
ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1901 తర్వాత ఫిబ్రవరిలో ఎక్కువ తాపం నమోదయ్యింది ఈ ఏడాదే. దేశ సగటు ఉష్ణోగ్రత 20.7 డిగ్రీల సెల్సియస్‌తో పోలిస్తే రాష్ట్రంలో 22.04 డిగ్రీల ఎండ కాసింది. ఉత్తర కర్ణాటకలో నే కాకుండా దక్షిణ జిల్లాల్లోనూ వేడిమి పెరిగింది. ఆదివారం సూర్యుని ప్రతాపం కనిపించింది. విధానసౌధలో పుస్తకమేళాలో జనం ఎండతో అల్లాడిపోయారు. గొడుగులు పట్టుకుని వచ్చారు. చాలామంది నీడపాటున కూర్చున్నారు. నగరంలోని మార్కెట్లలో వ్యాపారులు గొడుగుల నీడన కనిపించారు.
ఆదిలోనే సెగలు, చెమటలు
ఆదిలోనే సెగలు, చెమటలు
ఆదిలోనే సెగలు, చెమటలు
Comments
Please login to add a commentAdd a comment