ఉప లోకాయుక్త ఆకస్మిక తనిఖీ
హొసపేటె: ఉప లోకాయుక్త బీ.వీరప్ప శుక్రవారం నగరంలో వివిధ కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. అక్రమ కార్యకలాపాల నేపథ్యంలో ఉప లోకాయుక్త పర్యటన జరిగింది. ఉప లోకాయుక్త నగరంలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అదే విధంగా కౌంటర్‌లో రోగులకు అందిస్తున్న మందులను పరిశీలించారు. ఆస్పత్రి పాలనా విభాగం, అంబులెన్స్ వాహన డ్రైవర్లు తమ వేతనాలకు మించి అధికంగా ఫోన్‌పే వాడటంపై మండిపడ్డారు. ఈ విషయంపై డాటాను అందించాలని సూచించారు. అనంతరం నగరసభ కార్యాలయాన్ని సందర్శించి హాజరును పరిశీలించారు. నగర నడిబొట్టున ఉన్న ఉప కాలువను పరిశీలించి ఇది ఉప కాలువా? లేక మరుగుదొడ్డా? అని అధికారి మనోహర్‌ను క్లాస్ పీకారు. కాలువలోకి మరుగుదొడ్డి నీరు ప్రవహిస్తుండటాన్ని చూసి మండిపడ్డారు. కాలువలోకి మరుగుదొడ్డి నీరు ప్రవహించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని నగరసభ అధికారులకు సూచించారు. తహసీల్దార్ కార్యాలయం, మహిళా శిశు అభివృద్ధి కార్యాలయం, ఆర్‌టీఓ, హుడా, మైనింగ్ అండ్ జూవాలజీ, కార్మిక తదితర కార్యాలయాలతో పాటు విద్యార్థుల హాస్టళ్లను ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఏపీఎంసీ మార్కెట్ పరిశీలన
నగరంలోని ఏపీఎంసీ మార్కెట్‌ను ఉపలోకాయుక్త బీ.వీరప్ప శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రైతులకు పరిశుభ్రత, తాగునీరుతో పాటు విశ్రాంతి తీసుకోవడానికి సరైన వ్యవస్థ లేదన్నారు. సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఏపీఎంసీ కార్యదర్శి సిద్దయ్య స్వామిని ఆదేశించారు. ఓ దళారీ దుకాణంలో తూకంలో అధికంగా రెండు కిలోలు ఉన్న విషయాన్ని గ్రహించి వెంటనే దుకాణ యజమానికి క్లాస్ తీసుకొన్నారు. ప్రజలను ఇలా మోసం చేస్తున్నా అధికారులు కళ్లు మూసుకొని కూర్చొన్నారా? అని ప్రశ్నించారు. సంబంధిత అధికారికి నోటీసులు అందజేశారు.
ఉపలోకాయుక్తకు 183 ప్రజాఫిర్యాదులు
నగరంలోని సహకార సంక్షేమ మందిరంలో ఉప లోకాయుక్త పర్యటన మొదటి రోజున జరిగిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో మొత్తం 183 ఫిర్యాదులు వచ్చాయని ఉప లోకాయుక్త బీ.వీరప్ప తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి అత్యధికంగా జెడ్పీకి 60 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆ తర్వాత రెవెన్యూ శాఖకు 40, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీకి 41, జెస్కాం శాఖకు 6, గ్రామీణ తాగునీటి సరఫరాకు 5, ఆరోగ్య శాఖకు 3, కేఎస్‌ఆర్టీసీ 2, కార్మిక శాఖకు 3, పోలీస్ శాఖకు 3, విద్యా శాఖకు 4, మహిళ శిశు సంక్షేమ శాఖకు 2, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు 2, సర్వే శాఖకు 2 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో పీడబ్ల్యూడీ, ఆర్‌టీసీ, వాణిజ్య పన్నుల శాఖ, మొరార్జీ దేశాయి స్కూల్, హౌసింగ్ బోర్డు, అర్బన్ డ్రైనేజీ, ఎకై ్సజ్ శాఖలకు ఒక్కొక్క దరఖాస్తు అందిందన్నారు. ఉప లోకాయుక్త తనిఖీ తర్వాత 10 కేసులు అక్కడికక్కడే పరిష్కరించారు. కేవలం ఒక నెలలోనే దాదాపు 40 కేసులను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కేఎస్‌ఆర్టీసీ నుంచి అమరావతి నగరానికి బస్సు కనెక్టివిటీని త్వరగా అందించాలన్నారు. నగరంలోని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ దగ్గర గుట్కా, పొగాకు, మద్యం, మాంసం అమ్మకాలు జరగకుండా చూసుకోవాలని డీహెచ్‌ఓ డాక్టర్ శంకర్ నాయక్ మున్సిపల్ కమిషనర్ మనోహర్‌కు ఆదేశించారు.
ఉప లోకాయుక్త ఆకస్మిక తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment