
ఐదుగురు పీఎఫ్‌ఐ కార్యకర్తల అరెస్ట్
యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సీసీబీ పోలీసులు దాడి చేసి కేరళకు చెందిన నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) కార్యకర్తలు ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మూడు పిస్తోళ్లతో ఆరు తూటాలు, 12 కేజీల గంజాయి, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. కేరళలోని కాసరగోడు భీమనడి గ్రామం కున్నంక్కె వెస్ట్‌కు చెందిన నౌఫల్(38), సుంకదకట్టెకు చెందిన మన్సూర్(36), మంగల్పాడి పంచాయతీ నివాసి అబ్దుల్ లతీఫ్(29), కాసరగోడు జిల్లా మోర్నానకు చెందిన మహమ్మద్ అస్గర్(27), మహమ్మద్ సాలి(31)లను అరెస్ట్ చేసినట్లు వివరించారు.
అనుమానాస్పదంగా తిరుగుతుండగా..
ఈ నెల 12న మంగళూరు సమీపంలోని నాటికల్‌లో స్కార్పియోలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా నౌఫల్, మన్సూర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో నటోరియస్ క్రిమినల్స్ అబ్దుల్, లతీఫ్‌లను అర్కళ వద్ద అరెస్ట్ చేశారు. వీరు కేరళ నుంచి ఆక్రమంగా మంగళూరుకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయట పడింది. తలపాడి దేవిపురం వద్ద గంజాయి అమ్ముతుండగా మహమ్మద్ అస్గర్, మహమ్మద్ సాలిలను అరెస్ట్ చేశారు.
మూడు పిస్తోళ్లు, ఆరు తూటాలు జప్తు
12 కేజీల గంజాయి, మూడు కార్లు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment