బాలికా విద్యపై అవగాహనకు బైక్ ర్యాలీ
బళ్లారి అర్బన్: ఆడ పిల్లలను బాగా చదివించాలని జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కేహెచ్ విజయ్‌కుమార్ సూచించారు. భేటీ బచావో, భేటీ పడావో పథకం 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మహిళలు, బాలల రక్షణ, భద్రత, సాధికారతపై జాగృతి కల్పించడానికి వివిధ శాఖల ఆధ్వర్యంలో కొత్త జిల్లాధికారి కార్యాలయ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఆడపిల్లల పాత్ర చాలా కీలకం అన్నారు. ప్రతి ఆడ పిల్లను బాగా చదివించాలని సూచించారు. ఆడపిల్లలపై పక్షపాత ధోరణి ఇకపై విడిచి పెట్టాలన్నారు. ఈ విషయంలో ప్రజలు సానుకూలంగా తమ మనసత్వాలను మార్చుకోవాలన్నారు. ముఖ్యంగా సమాజంలో ఎక్కువగా జరుగుతున్న బాల్య వివాహాలను నివారించి ఆడపిల్లలను రక్షించడం ఈ కార్యక్రమ ఉద్దేశం అన్నారు. మహిళా, శిశు భ్రూణ హత్యలు చట్ట వ్యతిరేకం అన్నారు. సీ్త్ర సమాజం కన్ను ఆడపిల్లలను చదివించేలా ప్రోత్సాహం అందించడానికి వివిధ పథకాలను వినియోగించుకోవాలన్నారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఎటువంటి పక్షపాతం లేకుండా వారు నిర్భయంగా బతికే, చదివే హక్కు ఉందన్నారు. ఏ ఆడపిల్ల పాఠశాలకు దూరంగా ఉండరాదన్నారు. ముఖ్యంగా క్షీణిస్తున్న ఆడపిల్లల లింగనిష్పత్తి మెరుగుదలకు ప్రజల్లో జాగృతి కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఆ శాఖల అధికారులు జలాలప్ప ఏకే, రామకృష్ణ, ఏలే నాగప్ప, టీపీ ఈఓతో పాటు సహాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా సదరు బైక్ ర్యాలీ నగరంలోని ప్రముఖ వీధుల గుండా సాగి జెడ్పీ కార్యాలయం వరకు కొనసాగి ముగిసింది.
ఆడ పిల్లలను బాగా చదివించాలి
సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డీడీ విజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment