మెట్రో ఉద్యోగాలలో మొండిచేయి!
శివాజీనగర: బెంగళూరు మెట్రో రైల్ సంస్థ తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవల టికెట్ ధరలను పెంచి జనం జేబుకి కత్తెర వేసిందని ఆగ్రహం నెలకొంది. ఇంతలో స్థానికులకు మెట్రోలో ఉద్యోగాలు రాకుండా కట్టడి చేస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే బెంగళూరులో ఇతర భాషలవారి హవాతో కన్నడిగులకు ఉద్యోగాలు చేయి తప్పుతున్నాయని అసంతృప్తితో ఉన్నారు. నమ్మ మెట్రో కూడా నియామకాల్లో స్థానికులను నిర్లక్ష్యం చేస్తోందని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బెంగళూరు మెట్రో ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. బీఎంఆర్‌సీఎల్ హెచ్‌ఆర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఉన్నాయి. కన్నడ తెలియని ఇతర భాషలవారికి ఉద్యోగాలు ఇచ్చే కుట్ర జరిగిందని బీఎంఆర్‌సీఎల్ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. అందరూ కన్నడగులు చేరితే యూనియన్ ఏర్పాటు చేసుకుంటారు, తమ మాటను వినరనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. తక్షణమే ఈ నియామకాలను నిలుపుదల చేసి, కన్నడిగులకు మాత్రమే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
అన్యాయాన్ని సహించం: కరవే
ఈ వివాదంపై కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్రాధ్యక్షుడు టీఏ నారాయణగౌడ స్పందించారు. బెంగళూరు నమ్మ మెట్రోలో ఇతర భాషలవారికి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కన్నడిగులకు ఉద్యోగాలలో అన్యాయం జరుగుతోంది. నమ్మ మెట్రో విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనను రద్దు చేసి కన్నడిగులు మాత్రం ఎంపికయ్యే నోటిఫికేషన్‌ను విడుదల చేయకపోతే తీవ్ర పోరాటం చేపడుతామన్నారు. కన్నడిగులతో వ్యతిరేకతను పెంచుకుంటే బెంగళూరులో మెట్రో రైలు సంచరించటం కష్టమవుతుందని అన్నారు. ఈ వివాదంపై మెట్రో సంస్థ ఇంకా స్పందించలేదు.
నోటిఫికేషన్ తీరుపై కన్నడిగుల ఆగ్రహం
మెట్రో ఉద్యోగాలలో మొండిచేయి!
Comments
Please login to add a commentAdd a comment