కళాభిమానుల మనసు దోచిన చిత్ర సంత
రాయచూరు రూరల్: కుంచెకారుల నుంచి జాలువారిన చిత్రలేఖనాలు నగరవాసులను అబ్బురపరిచాయి. సమాజంలోని పలు అంశాలను ఇతివృత్తాలుగా చేసుకొని కళాకారులు గీసిన చిత్రాలతో నగరంలోని సిద్దరామ జంబల దిన్ని రంగ మందిరం వద్ద శంకర గౌడ బెట్టదూరు వేదిక ఆధ్వర్యంలో కళా సంకుల సంస్థ అధ్యక్షురాలు రేఖ, మారుతి ఏర్పాటు చేసిన చిత్ర సంతే కార్యక్రమం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గోవా, తెలాంగణ నుంచి వచ్చిన కళాకారులు గీసిన చిత్రాలను ప్రదర్వించారు. కళాభిమానలు పెద్ద సంఖ్యలో వచ్చిపెయింటింగ్స్‌ను వీక్షించారు. అంతకుముందు చిత్ర సంతెను ప్రారంభించిన వ్యవసాయ వర్సిటీ వైస్‌చాన్సలర్ హన్మంతప్ప, రాయచూరు ఎంపీ కుమార్ నాయక్‌లు మాట్లాడుతూ చిత్రకళను ప్రోత్సహించాలన్నారు. అంతరించి పోతును కళలకు జీవం పోసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. రాయచూరులో శంకరగౌడ బెట్టదూరు పేరుపై అర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌నేత రవి తెలిపారు. అనంతరం డాక్టర్ ప్రాణేష్‌ను సత్కరించారు. ఎమ్మెల్సీ వసంత్ కుమార్, వెంకటేష్, విన బెంచి, పట్టేద్, రవి, శాలం, నరసింహు లు, చేతన్, వీరేష్, ఈరణ్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment