
రూ. 50 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం
కోలారు: కోలారు జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నైజీరియా, ఇతర దేశాల నుంచి తక్కువ ధరకు ఎండీఎం మాదక ద్రవ్యాన్ని ఖరీదు చేసి కోలారులోని పారిశ్రామిక ప్రాంతం, కళాశాలలు తదితర ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారంతో సైబర్ క్రైం పోలీసులు నగర సమీపంలోని మడేరహళ్లి వద్ద శుక్రవారం కాపుగాచారు. ఆ సమయంలో వచ్చిన బైక్‌ను సోదా చేయగా రూ. 50 లక్షల విలువైన 806 గ్రాముల ఎండీఎం లభ్యమైంది. డ్రగ్స్, బైక్‌ను స్వాధీనం చేసుకొని సయ్యద్ పుర్కాన్ అనే డ్రగ్ పెడ్లర్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్సీ బి నిఖిల్ తెలిపారు. డ్రగ్స్‌ను పట్టుకున్న పోలీసులకు 10 వేల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు.
వ్యక్తిగత హాజరుపై స్టే
శివాజీనగర: మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్పపై నమోదైన పోక్సో కేసులో నేరుగా విచారణకు హాజరు కావాలని ఇచ్చిన ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. కేసు రద్దు కోరుతూ యడియూరప్ప హైకోర్టులో పిటిషన్ వేశారు. మార్చి 15న నేరుగా హాజరు కావాలని బెంగళూరులోని 1వ త్వరిత గతి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను ప్రశ్నిస్తూ యడియూరప్ప హైకోర్టు మెట్లెక్కారు. శుక్రవారం హైకోర్టు పిటిషన్‌పై విచారణ జరిపి, కాగ్నిజెన్స్ సమన్ల ఆదేశాలపై స్టే ఇచ్చింది. దీంతో యడియూరప్పకు మధ్యంతర ఊరట లభించింది.
ప్రసన్న నంజుండేశ్వర స్వామి వైభవం
మైసూరు: మైసూరులోని పాత సంతెపేటలో కొలువైన చరిత్ర ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న నంజుండేశ్వర స్వామి బ్రహ్మరథోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఉదయం నుంచే స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు నిర్వహించారు. అనంతరం వివిధ పూజలు నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించిన రథంలో కొలువు దీర్చారు. ఎమ్మెల్యే హరీష్‌గౌడ, గౌరి దంపతులు పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య రథం ముందుకు కదిలింది. వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు.
కై వారంలో బ్రహ్మరథోత్సవం
చింతామణి: పౌర్ణమిని పురస్కరించుకొని కైవారంలో శుక్రవారం అమరనారేయణస్వామి బ్రహ్మరథోత్సవం ఘనంగా జరిగింది. కై వార ధర్మాధికారి జయరాం దంపతులు స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తిని రథంలో ఉంచి ఊరేగించారు. వేలాది మంది భక్తులు పాల్గొని రథోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. చింతామణి వారిచే దానవీరశూరకర్ణ నాటకం భక్తాదులను ఆకట్టుకొంది. ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.
తరగతి గదిలోనే విద్యార్థిని హఠాన్మరణం
యశవంతపుర: ఓ చిన్నారి తరగతి గదిలో హఠాన్మరణం చెందింది. ఈవిషాద ఈ ఘటన కొడగు జిల్లా సోమవారపేటలో జరిగింది. క్యాతె గ్రామంలోని అబ్దుల్ కలాం వసతి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న పూర్విక గురువారం పాఠశాలకు వచ్చింది. తరగతి గదిలో పాఠాలు వింటూ కుప్పకూలడంతో కొడ్లిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హాసన పట్టణలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

రూ. 50 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం

రూ. 50 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం

రూ. 50 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment