
అంబరం.. హోలీ సంబరం
సాక్షి,బళ్లారి: మన సంస్కృతి వారసత్వాలకు ప్రతీకగా నిలుస్తోన్న ఎన్నో పండుగల్లో హోలీ కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి ఏటా ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున జరుపుకునే హోలీ పండుగను ఈ ఏడాది కూడా సంప్రదాయబద్ధంగా తమ తమ ఇళ్లలో పౌర్ణమి పూజలు నిర్వహించుకున్నారు. శుక్రవారం హోలీ పండుగ నేపథ్యంలో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా రంగులు చల్లుకుని ఆనందోత్సాహాలతో హోలీ పండుగను ఆచరించుకున్నారు. నగరంలో యువత కేరింతలు కొడుతూ రంగులు చల్లుకుని ఒకరికొకరు హ్యాపీ హోలీ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు చేసుకున్నారు. యువత, పెద్దలు అనే తేడా లేకుండా రంగులు చల్లుకుని హోలీ పండుగ గొప్పదనాన్ని తెలియజేస్తూ పండగను ఆచరించారు. రంగులు చల్లుకుని హోలీ సంబరాలు నిర్వహించిన తరుణంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో పలు ప్రముఖ కాలనీల్లో పోలీసులు బందోబస్తు నిర్వహించి హోలీ పండగ చేసుకుని, రంగులు చల్లుకునే వ్యక్తులపై నిఘా ఉంచారు. హోలీ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో మహిళా పోలీసులతో పాటు బందోబస్తు ఏర్పాటు చేసి, శాంతియుతంగా పండుగను జరుపుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
సంతోషంగా రంగుల హోలీ ఆడిన ప్రజలు
రాయచూరు రూరల్ : జిల్లాలో రంగుల హోలీ కేళి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకున్నారు. నగరంలోని బెస్తవారపేట ఉప్పార సమాజం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కామదహనం చేశారు. ప్రజలు హోలీ పాటలు పాడుతూ రంగులు చల్లుకుంటుండటం కన్పించింది. భంగికుంటలో కుండ బద్దలు కొట్టారు. హోలీ సందర్భంగా రాయచూరులో పోలీసులు హైఅలర్ట్‌తో రంజాన్ రెండో శుక్రవారం హోలీ పండుగ రావడంతో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అదనపు జిల్లా ఎస్పీ హరీష్ పర్యవేక్షణ జరిపారు.
విజయనగరలో ఘనంగా హోలీ
హొసపేటె: హోలీ పండుగ సంబరాలను శుక్రవారం నగర ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకొన్నారు. నగరంలోని అమరావతి, పటేల్‌నగర్, బసవేశ్వర కాలనీ, రాజీవ్ నగర్, చిత్తవాడిగి, నెహ్రు కాలనీ, రాణిపేట, మృత్యుంజయ నగర్, చలువాది నగర్, టీబీ డ్యాం తదితర ప్రాంతాల్లో యువతీ యువకులు, విద్యార్థులు, పెద్దలు, పిల్లలు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకొన్నారు.
సంస్కృతి వారసత్వాలకు ప్రతీకగా
రంగుల కేళి
ఆనందోత్సాహాలతో పిల్లలు, పెద్దలు, మహిళలు కేరింతలు

అంబరం.. హోలీ సంబరం

అంబరం.. హోలీ సంబరం

అంబరం.. హోలీ సంబరం
Comments
Please login to add a commentAdd a comment