రాయచూరు రూరల్: దొంగలు రెప్పపాటులో రూ.7 లక్షలు చోరీ చేసిన ఘటన శుక్రవారం రాయచూరు జిల్లాలోని దేవదుర్గ తాలూకా గబ్బూరు గ్రామంలో జరిగింది. రైతు శ్రీనివాసరావు బ్యాంక్‌లో డబ్బులు విత్ డ్రా చేసి బ్యాగులో పెట్టుకొని పండ్లు కొనుగోలు చేయడానికి వెళ్లారు. పసిగట్టిన దుండగులు ద్విచక్ర వాహనంలో ఉన్న నగదును చోరీ చేసుకొని పరారయ్యారు. పక్కనే ఉన్న సీసీ కెమెరాల్లో దుండగులు పరారైన దృశ్యాలు నమోదయ్యాయి. గబ్బూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వైద్యుల పదవీ విరమణ వయస్సు పెంపునకు ప్రతిపాదనలు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 65 సంవత్సరాలకు పెంపుపై ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు రాయచూరు జిల్లా ఇంచార్జి మంత్రి, వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం బెంగళూరులో జయదేవ హృద్రోగ ఆస్పత్రిలో వైద్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీనియర్ వైద్యులను గుర్తించి వారి సేవలను మరింతగా వినియోగించుకోవడానికి ముఖ్యమంత్రితో చర్చించి సంజీవిని పథకం కింద వైద్యులను భర్తీ చేస్తామన్నారు. జయదేవ్ ఆస్పత్రిలో రోబోటిక్ ఆపరేషన్లు చేయడానికి నిధులు కేటాయించి, చిన్నారుల గుండె ఆపరేషన్లకు ఐదు చోట్ల ఆపరేషన్ థియేటర్లను, పరిశోధన కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు.
రేపు జగ్గలిగి పండుగ
హుబ్లీ: భారతీయ సంప్రదాయపు ప్రధాన పండుగ హోలీ సందర్భంగా హుబ్బళ్లి జగ్గలిగి పండుగ– 2025ను మూరుసావిర మఠం మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా జగ్గలిగి పండుగను నిర్వహిస్తున్నామన్నారు. అన్ని సమాజాల వారు దీనికి సహకారం అందిస్తున్నారన్నారు. మూరుసావిర మఠాధిపతి గురుసిద్ద రాజయోగీంద్ర స్వామీజీతో పాటు పలువురు మఠాధిపతులు ఈ కార్యక్రమానికి సాన్నిధ్యం వహిస్తారన్నారు. 350 జగ్గలిగి బృందాలు, వివిధ చర్మ వాయిద్య నాదాలతో పాటు డోలు, కీలుబొమ్మలతో 45 మంది కళాకారుల బృందం, మహిళలు శోభయాత్రలో పాల్గొంటారన్నారు. ప్రదర్శన మూరుసావిర మఠం నుంచి బండారి రోడ్డు తుళజా భవాని సర్కిల్, కొత్త మేదార ఓణి, శివాజీ చౌక్, దుర్గద బైలు, బెళగావి గల్లి, పెండార గల్లి, దాజిబానపేట మార్గం మీదుగా తిరిగి మూరు సావిర మఠానికి చేరుకుంటుందన్నారు. మూరు సావిర మఠాధిపతి మాట్లాడుతూ పౌరాణిక విషయాలను గుర్తు చేసే సమగ్ర, దేశ శ్రేష్టమైన పండుగ ఇదన్నారు. చర్మ వాయిద్యాలతో వెలువడే సంగీత ప్రదర్శనే ఈ పండుగ ఉద్దేశం అన్నారు. జానపద కళలను ప్రోత్సహించే సదుద్దేశంతో జగ్గలిగి పండుగను అందరూ ప్రోత్సహించాలన్నారు. మేయర్ రామన్న బడిగేర, ప్రముఖులు అశోక్ కాట్వే, లింగరాజ పాటిల్, రాజు కాళె, మంజునాథ, జగదీశ్, రవినాయక పాల్గొన్నారు.
సీ్త్రలకూ సమాన హక్కులు
రాయచూరు రూరల్: సదృఢ సమాజ నిర్మాణానికి పురుషులతో పాటు సీ్త్రలు కూడా సమానమని జిల్లా అదనపు జడ్జి, న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు హెచ్.స్వాతిక్ పేర్కొన్నారు. శుక్రవారం ఉప్పారవాడి వేంకటేశ్వర ఆలయంలో న్యాయ సేవా ప్రాధికార, ఎస్‌సీఏబీ లా కళాశాల, మహిళా శిశు కళ్యాణ శక్తి క్లబ్, ఉప్పార మహిళా ఘటక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జ్యోతి వెలిగించి మాట్లాడారు. మహిళల హక్కులు, విధులు, సమానత్వం, విద్యా, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు వీలవుతుందన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవా ప్రాధికార కార్యదర్శి మృత్యుంజయ, కళాశాల ప్రిన్సిపాల్ పద్మజ, అధ్యాపకురాలు ఉమ, ఉప్పార మహిళా ఘటక అధ్యక్షురాలు మాలతిలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment