రమణీయంగా తేరు ఉత్సవాలు
దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం తాలూకాలో పలు చోట్ల రథోత్సవాలు ఘనంగా జరిగాయి. తూబుగెరెలోని పురాతన ప్రసిద్ధ శ్రీ ప్రసన్న లక్ష్మీ వేంకటరమణస్వామి రథోత్సవం శుక్రవారం అభిజిత్ లగ్నంలో వైభవంగా జరిగింది. అంతకుముందు మూలవిరాట్‌కు విశేష పూజలు నిర్వహించారు. తాలూకా నుండే కాకుండా చిక్కబళ్లాపురం, కోలారు, బెంగళూరు జిల్లాల నుంచి వందలాదిగా భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇదే తాలూకాలోని కామేనహళ్లిలో వెలసిన గుట్టె లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కూడా శుక్రవారం ఎంతో ఘనంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. దాతలు భక్తులకు పానకం, మజ్జిగ పంపిణీ చేశారు.
రమణీయంగా తేరు ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment