
సాక్షి, బెంగళూరు : దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధించిన రాష్ట్రాల జాబితాలో తాజాగా కర్ణాటక కూడా చేరింది. కరోనా మహమ్మారితో పాటు వాయు కాలుష్యం కూడా వైరస్ వ్యాప్తికి కారణం నేపథ్యంలో పటాకుల అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా టపాసులు అమ్మకాల నిషేధంతో పాటు ఒకవేళ అమ్మినా లేక కాల్చినా లక్ష వరకూ జరిమానా చెల్లించాల్సిందిగా ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇక రాజస్థాన్, ఒడిశా కూడా టపాసులపై బ్యాన్ విధించింది.
Comments
Please login to add a commentAdd a comment