బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈనెల 5నుంచి మొదలుకానున్న నేపథ్యాన ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఇంటర్మీడియట్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ సీహెచ్.యాదగిరి సూచించారు. విద్యార్థులకు ఇక్కట్లు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయించడమే కాక అవకతవకలు జరగకుండా పర్యవేక్షించాలని తెలిపారు. కలెక్టరేట్‌లోని శుక్రవారం ఆయన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లతో సమావేశమై సూచనలు చేశారు. డీఐఈఓ రవిబాబు మాట్లాడుతూ ప్రశ్నాపత్రాలను పోలీస్ ఎస్కార్ట్‌తోనే కేంద్రాలకు తీసుకెళ్లాలని తెలిపారు. డీఈసీ సభ్యులు కె.శ్రీనివాసరావు, సింహాచలం, వీరభద్రం, హైపవర్ కమిటీ బాధ్యులు విజయకుమారి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
బాలికల కళాశాలలో...
ఖమ్మంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఇంటర్మీడియట్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ సీహెచ్.యాదగిరి సందర్శించారు. ఇటీవల కళాశాలలో ఓ విద్యార్థినిని అధ్యాపకుడు వేధించినట్లు ఆరోపణలువచ్చాయి. దీంతో కళాశాలకు వచ్చిన యాదగిరి ప్రిన్సిపాల్ అరుణ్‌కుమార్‌తో పాటు అధ్యాపకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ భారతిరాణి సైతం కళాశాలకు వచ్చి వివరాలు సేకరించారు.
ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ యాదగిరి
Comments
Please login to add a commentAdd a comment