విజయం సాధ్యమే..
పట్టుదలతో
ప్రయత్నిస్తే
ఖమ్మం సహకారనగర్: విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవడమే కాకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సొంతమవుతుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌బీఐటీలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జి(టాస్క్) ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి ఐడియాథాన్‌ను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ఇంటర్నెట్ యుగంలో ప్రపంచమే కుగ్రామంలా మారినందున విద్యార్థులు మానవ మేధస్సే కర్మాగారమని గుర్తించి తమ ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు. కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ అన్ని రంగాల్లో రాణిస్తున్న ఈ తరం విద్యార్థులు రానున్న రోజుల్లో అద్భుతాలు సృష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టాస్క్ రిలేషన్‌షిప్ మేనేజర్ దినేష్, ప్రాజెక్ట్ మేనేజర్ బి.బాలుప్రవరాఖ్య మాట్లాడుతూ జిల్లాస్థాయిలో పది కళాశాలల నుంచి 313 థీమ్‌లు పంపారని, అందులో 56 ఎంపిక చేయగా 186 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఇక్కడి నుంచి మెరుగైన థీమ్‌లను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని వెల్లడించారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ జి.ధాత్రి, అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్‌కుమార్, గంధం శ్రీనివాసరావు, శివప్రసాద్, రవీంద్రబాబు, శ్రీని వాసరావు, ప్రిన్సిపాల్ జి.రాజ్‌కుమార్‌తో పాటు అర్జున్, శ్రీరామ్ సంకీర్త్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌బీఐటీలో ‘ఐడియాథాన్’ను
ప్రారంభించిన కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్
Comments
Please login to add a commentAdd a comment