రిటైర్డ్ ఉద్యోగులకు సన్మానం
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం క్రైం: జిల్లాలోని వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తూ శుక్రవారం ఉద్యోగ విరమణ చేసిన 15మంది ప్రభుత్వ ఉద్యోగులను కలెక్టరేట్‌లో సన్మానించారు. ఈసందర్భంగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఏళ్ల పాటు నిర్విరామంగా విధులు నిర్వర్తించిన ఉద్యోగుల సేవలు మరువలేనివని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడగా జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే, పోలీసు శాఖలో ఉద్యోగ విరమణ చేసిన ఎల్.శ్రీనివాసరావు(పీసీఆర్), మైసయ్య(ఏఆర్ ఎస్‌ఐ), వీరస్వామి(ఏఆర్ ఎస్‌ఐ), ఎం.డీ.అజ్మతుల్లా(ఏఎస్సైఐ, తిరుమలాయపాలెం)ను కమిషనరేట్‌లో సీపీ సునీల్‌దత్ సన్మానించారు. అదనపు డీసీపీలు ప్రసాద్‌రావు, కుమారస్వామి, ఏఆర్ ఏసీపీలు నర్సయ్య, సుశీల్‌సింగ్, ఆర్‌ఐ అప్పలనాయుడు, పోలీస్ అసోసియేషన్ బాధ్యులు వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, పంతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment