ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు..
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించి ప్రాధాన్యతాక్రమంలో త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డే(ప్రజావాణి)లో ఆయన పలువురి నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. ప్రతీ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని, ఏవైనా దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను తెలియచేయాలని సూచించారు. సత్తుపల్లి మండలం చెరుకుపల్లికి చెందిన తాటి రాములు సర్వే నంబర్ 113లో తన భూమిని గిరిజనేతరులు ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. అలాగే, ఖమ్మం ప్రకాశ్‌నగర్‌కు చెందిన సీ.హెచ్.విజయ్‌కుమార్ తనకు వ్యాపార నిమిత్తం రుణం మంజూరు చేయించడమే కాక మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనం ఇప్పించాలని, కల్లూరుకు చెందిన ఎన్.సుజాత దివ్యాంగుల కోటాలో ఇరిగేషన్ కార్యాలయంలో స్వీపర్ పోస్ట్ ఇప్పించాలని కోరారు. ఇలా పలువురు వివిధ సమస్యలపై విన్నవించగా పరిష్కారంపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. తొలుత ప్రజావాణి దరఖాస్తుల నమోదు సెక్షన్‌కు వెళ్లి వివరాలు ఆరా తీశారు. అలాగే, చేయూత పెన్షన్ సహాయక కేంద్రాన్ని కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈకార్యక్రమాల్లో డీఆర్వో ఏ.పద్మశ్రీ, డీఆర్‌డీఓ సన్యాసయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నాలుగేళ్లుగా తిరుగుతున్నా...
ఖమ్మం దివ్యాంగుల కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాం. నా కుమారుడు వినయ్‌కుమార్ అనారోగ్యం కారణంగా నేను ఏ పనికి వెళ్లలేకపోతున్నా. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నందున డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇప్పించాలి. ఈ విషయంలో నాలుగేళ్లుగా తిరుగుతున్నందున స్పందించాలి.
– బత్తుల ధనలక్ష్మి, రమణగుట్ట, ఖమ్మం
ఎవరూ పట్టించుకోవడం లేదు..
నామవరం రెవెన్యూ పరిధిలో ఏడెకరాల భూమిని బంధువులు ఆక్రమించుకున్నారు. పదిహేనేళ్లుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తహసీల్, ఆర్డీఓ కార్యాలయాల్లోనే కాక కలెక్టరేట్‌లోనూ ఫిర్యాదు చేశా. ఽభూమి నా పేరిట లేక నా కుటుంబీకులు సైతం పట్టించుకోవడం లేదు.
– చిలక సైదులు, నామవరం, చింతకాని మండలం
గ్రీవెన్స్ డేలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
పంటలకు నీటి సరఫరాపై దృష్టి
యాసంగిలో రైతులు సాగు చేసిన పంటలకు నీరందించేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆమె యాసంగి పంటలకు నీటి సరఫరా, గురుకులాల్లో తనిఖీలు, ప్లాస్టిక్ నిషేధంపై సమీక్షించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రానున్న పది రోజులు అప్రమత్తంగా ఉంటూ చివరి ఆయకట్టు వరకు నీరందేలా చూడాలని, ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఆటంకం ఎదురుకాకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ కలెక్టరేట్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలతో సీ్త్ర శక్తి టీ స్టాళ్లలో ప్లాస్టిక్ నిషేధించామని తెలిపారు. అలాగే, పంటలకు నీటి సరఫరా, విద్యుత్ అంతరాయాలు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈసమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్‌ఈలు వాసంతి, ఎం.వెంకటేశ్వర్లు, విద్యుత్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, డీఏఓ పుల్ల య్య, జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు..
ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు..
Comments
Please login to add a commentAdd a comment