శ్రీ కాశ్మీర మహాదేవ క్షేత్రం ఆదాయం రూ.7.62 లక్షలు
కల్లూరు: మహాశివరాత్రి జాతర సందర్భంగా కల్లూరులోని శ్రీ కాశ్మీర మహాదేవ క్షేత్రంలో భక్తులు సమర్పించిన కానుకలతో పాటు ఇతరత్రా రూపాల్లో రూ.7,62,597 ఆదాయం నమోదైందని ఆలయ మేనేజర్ ఎస్‌వీడీ.ప్రసాద్ తెలిపారు. హుండీల్లో కానుకలను సోమవారం లెక్కించగా రూ.1,81,470గా నమోదైందని వెల్లడించారు. అలాగే, వేలం పాటల ద్వారా రూ.2,93,300, దర్శనం, అభిషేకం టికెట్ల అమ్మకంతో రూ.1.30,727, జాయింట్ వీల్ నిర్వాహకుల నుంచి రూ.లక్ష, షాపుల అద్దె ద్వారా రూ.32,600, పార్కింగ్ నుంచి రూ.24,500 కలిపి మొత్తం రూ.7,62,597 ఆదాయం వచ్చిందని తెలిపారు. హుండీ లెక్కింపులో దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ ఇ.వెంకటేశ్వర్లు, అర్చకులు సురేష్‌శర్మ, ఆలయ చైర్మన్ మాడిశెట్టి వెంకటేష్‌తో పాటు అబ్బూరి యుగంధర్, పెద్దబోయిన శివకృష్ణ, పెద్దబోయిన నరసింహారావు, కిష్టంశెట్టి ఏడుకొండలు, కిష్టంశెట్టి నర్సింహారావు, సాయిని రవి, పెద్దబోయిన విజయ్‌కుమార్, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
13న పండితాపురం
సంత వేలం పాట
కామేపల్లి: రాష్ట్రంలోనే పేరున్న కామేపల్లి మండలంలోని కొమ్మినేపల్లి(పండితాపురం) గ్రామపంచాయతీ పరిధి శ్రీకృష్ణప్రసాద్ పశువుల సంత నిర్వహణకు ఈనెల 13న వేలం నిర్వహించనున్నట్లు గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీడీఓ రవీందర్ తెలిపారు. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టే ఈ వేలం సంత ఆవరణలో జరుగుతుందని వెల్లడిచారు. జీపీ పరిధిలోని ఎస్టీలు మాత్రమే పాల్గొనేందుకు అర్హులని, ధరావత్ సొమ్ము రూ.30 లక్షలు, సాల్వెన్సీ కింద రూ.5లక్షలు చెల్లించి పాల్గొనాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఖమ్మం సహకారనగర్: 2024–డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకుని బోధన మెరుగుపర్చుకోవాలని పాఠశాల విద్యాశాఖ వరంగల్ ఆర్‌జేడీ సత్యనారాయణ సూచించారు. ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ పాఠశాలలో ఎస్‌జీటీలకు ఇస్తున్న శిక్షణను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రతీ సబ్జెక్టులో కనీస అభ్యసన సామర్థ్యాలు పెరిగేలా బోధన జరగాలని, తద్వారా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మ కం పెరుగుతుందని చెప్పారు. తొలుత ఎన్నెస్సీ కాలనీలో ఎఫ్‌ఎల్‌ఎన్ తీరు, డైట్ కళాశాలలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. విద్యాశాఖ ఏఎంఓ రవికుమార్, డీఈఓ సోమశేఖరశర్మ, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
1,345 ఫిర్యాదుల్లో 1,018 పరిష్కారం
ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి
ఖమ్మంవ్యవసాయం: ప్రజావాణిలో అందే ఫిర్యాదుల పరిష్కారానికి విద్యుత్ ఉద్యోగులు ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి సూచించారు. ప్రజావాణిలో అందుతున్న ఫిర్యాదులు, పరిష్కారంపై ఆయన వివరాలు వెల్లడించారు. గత ఏడాది జూన్ 17న ప్రతీ సోమవారం సర్కిల్, డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే నిర్వహిస్తూ బిల్లులు, మీటర్ల సమస్యలు, సరఫరాలో హెచ్చతగ్గులు తదితర అంశాలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 1,345 ఫిర్యాదులు అందగా, ఇందులో 1,018 సమస్యలను పరిష్కరించామని వెల్లడించారు. కాగా, ఉద్యోగులు ఎప్పటికప్పుడు సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని, ఇందుకోసం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్‌ఈ సూచించారు.
కలెక్టర్‌ను కలిసిన ఎస్‌ఈ
ఖమ్మం ఎస్‌ఈగా బాధ్యతలు స్వీకరించిన శ్రీని వాసాచారి సోమవారం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు మొక్క అందజేయగా, పలు అంశాలపై మాట్లాడారు.
శ్రీ కాశ్మీర మహాదేవ క్షేత్రం ఆదాయం రూ.7.62 లక్షలు
శ్రీ కాశ్మీర మహాదేవ క్షేత్రం ఆదాయం రూ.7.62 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment