‘వనజీవి’ని కలిసిన బీట్ ఆఫీసర్లు
ఖమ్మంరూరల్: మండలంలోని రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యను రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ 35వ బ్యాచ్‌కు చెందిన 40మంది ఫారెస్ట్ ట్రైనింగ్ బీట్ ఆఫీసర్లు మంగళవారం కలిశారు. ఈసందర్భంగా విత్తనాల సేకరణ, మొక్కలు నాటడం, పరిరక్షణపై తన అనుభవాలను రామయ్య వివరించారు. మొక్కలు నాటడమే కాక అడవులను నరికివేయకుండా అడ్డుకోవడాన్ని అందరూ బాధ్యతగా భావించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అటవీ అకాడమీ కోర్సు డైరెక్టర్ గంగారెడ్డి, కూసుమంచి రేంజ్ ఆఫీసర్ పి.శ్రీనివాసరావు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కే.వీ.రామారావుతో పాటు ఉద్యోగులు కొండల్‌రావు, పి.డానియేల్, వెంకటేశ్వర్లు, నర్సింహారావు, మధు తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ వార్షికలు బుధవారం మొదలుకానుండగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో సమావేశమయ్యారు. బుధవారం నుంచి 25వ తేదీ వరకు నిర్ణీత తేదీల్లో ఉదయం 9నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 72కేంద్రాలు ఏర్పాటుచేయగా, ప్రథమ సంవత్సరం విద్యార్థులు 17,783, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 18,877మంది పరీక్షలు రాయనున్నారని చెప్పారు. ఉదయం 8గంటల నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్‌ను 99489 04023 నంబర్ ద్వారా సంప్రదించాలని తెలిపారు. అనంతరం డీఐఈఓ పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు.
సౌర విద్యుత్ ప్లాంట్లకు దరఖాస్తు గడువు పెంపు
ఖమ్మంవ్యవసాయం: రైతులు తమ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 10వ తేదీ వరకు పొడిగించారు. పీఎం కుసుమ్ పథకం కింద వ్యవసాయ యోగ్యం కాని బీడు, బంజర భూముల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రైతులతో పాటు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, వివిధ సంస్థలకు సైతం అవకాశం కల్పించారు. అయితే, దరఖాస్తు గడువు 2వ తేదీతో ముగియగా ఉమ్మడి జిల్లాలో 75 మంది ముందుకొచ్చారు. ఈనేపథ్యాన గడువు పెంచగా, ఆసక్తి ఉన్న రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని రెడ్‌కో ఉమ్మడి జిల్లా మేనేజర్ పి.అజయ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
సాగర్ జలాలను సద్వినియోగం చేసుకోండి
చింతకాని/ఎర్రుపాలెం: సాగర్ జలాలను రైతులు సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. చింతకాని రైతువేదికలో మంగళవారం రైతులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ వారబందీ విధానంలో నీరు విడుదల చేస్తుండగా చివరి ఆయకట్టుకు సైతం చేరేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఇదేసమయాన రైతులు కూడా సహకరించాలని కోరారు. అనంతరం డీఏఓ పుల్లయ్య ఎర్రుపాలెం మండలం మామునూరులో వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఎక్కడైనా పంట వడలినట్లు అనిపిస్తే రెండు శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలని తెలిపారు. మధిర ఏడీఏ విజయ్‌చంద్ర, ఏఓ మానస, ఇరిగేషన్ డీఈ సాంబశివరావు, ఏఈఓలు రాము, తేజ, ఆయేషా, కల్యాణి, జి.గోపి, బండి శ్రీకాంత్ పాల్గొన్నారు.
‘వనజీవి’ని కలిసిన బీట్ ఆఫీసర్లు
‘వనజీవి’ని కలిసిన బీట్ ఆఫీసర్లు
Comments
Please login to add a commentAdd a comment