చివరి ఆయకట్టు వరకు సాగర్ నీరు
బోనకల్: బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలో చివరి ఆయకట్టు భూములకు సైతం సాగర్ జలాలు అందేలా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బోనకల్ తహసీల్‌లో మంగళవారం ఆయన ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. బీబీసీ పరిధిలోని చివరి భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. వారబందీ విధానమే ఇందుకు కారణమని వారు చెబుతున్నందున, ఈ దఫా విడుదల చేసే సాగర్ జలాలను వృథా కాకుండా చివరి భూములకూ అందేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే, ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. తహసీల్దార్ పున్నంచందర్, ఎంపీడీఓ రమాదేవి, ఏఓ వినయ్‌కుమార్, ఇరిగేషన్ ఏఈ రాజేష్, ఆర్‌ఐ లక్ష్మణ్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.
పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఖమ్మం సహకారనగర్: ఈనెల 21న మొదలుకానున్న ఎస్సెస్సీ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.,శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన వరంగల్ ఆర్‌జేడీ సత్యనారాయణతో కలిసి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, ఇతర అంశాలపై సూచనలు చేశారు. డీఈఓ సోమశేఖరశర్మ, డీసీఈబీ కార్యదర్శి నారాయణ, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రమేష్ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment