సీతారామ కాల్వల్లో ‘గోదావరి’ పరవళ్లు
అశ్వాపురం/ములకలపల్లి: సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాలువల్లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతున్నాయి. రెండు పంప్‌హౌస్‌ల్లోనూ రెండో రోజు కూడా మోటార్లు ఆన్ చేయడంతో భారీగా దిగువకు తరలుతున్నాయి. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులోని పంప్ హౌస్ –1 నుంచి ములకలపల్లి మండలం వీకే రామవరం శివారులోని పంప్‌హౌస్–2కు చేరుకున్నాయి. దీంతో ఇక్కడ మంగళవారం డిశ్చార్జి పాయింట్ వద్ద నీటిని ఎత్తిపోశారు. దీంతో 35 మిలియన్ క్యూబిక్ ఫీట్‌ల(ఎంసీఎఫ్‌టీ) నీళ్లు కమలాపురం పంప్‌హౌస్–3కి వదిలినట్లు ఐబీ డీఈ మోతీలాత్ తెలిపారు. మంగళవారం ఒక్కరోజే ఐదున్నర గంటలపాటు మోటార్లు నడిపించి, 30 ఎంపీఎఫ్‌టీల నీటికి దిగువకు మళ్లించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కాగా, అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్ట్ ఫేస్–1 పంప్‌హౌస్ ద్వారా సోమవారం ఎనిమిది గంటలు, మంగళవారం ఎనిమిది గంటల పాటు గోదావరి జలాలు దిగువకు ఎత్తిపోశారు. గంటకు 5.4 ఎంసీఎఫ్‌టీ చొప్పున 86.4 ఎంసీఎఫ్‌టీ నీరు దిగువకు ఎత్తిపోశారు. బీజీకొత్తూరు, పూసుగూ డెం, కమలాపురం పంప్‌హౌస్‌ల ద్వారా 100.22 కిలోమీటర్ల వద్ద ఏన్కూరు లింక్ కెనాల్ మీదుగా 8.60 కిలోమీటర్లు ప్రవహించనుండగా, నాగార్జున సాగర్ కెనాల్‌కు తరలించనున్నారు.
రైతుల్లో ఆనందం..
చండ్రుగొండ : రైతుల ఏళ్ల నాటి కల మంగళవారం సాకారమైంది. ట్రయల్‌రన్‌లో భాగంగా సీతారామ కాల్వలోకి నీరు వదలగా అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాలకు గోదావరి జలాలు రావడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
పంప్‌హౌస్‌ల ద్వారా ఎత్తిపోత
నేడు రాజీవ్ కెనాల్‌కు నీరు విడుదల చేయనున్న మంత్రి తుమ్మల
ఆపై ఎన్నెస్పీ కెనాల్‌లోకి గోదావరి జలాలు
నేడు రాజీవ్ లింక్ కెనాల్ ట్రయల్ రన్..
జూలూరుపాడు: సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి ఎన్నెస్పీ కెనాల్‌లోకి గోదా వరి జలాలు చేరనున్నాయి. ఈ మేరకు సీతారామ మెయిన్ కెనాల్ నుంచి ఏన్కూ రు ఎన్నెస్పీ కెనాల్‌లోకి గోదావరి జలాలను చేర్చే రాజీవ్ లింక్ కెనాల్ వద్ద బుధవారం ట్రయల్‌రన్ జరగనుంది. అశ్వాపురం మండలంలోని పంప్‌హౌస్ నుంచి వంద కి.మీ. దూరాన వినోభానగర్ మెయిన్ కెనాల్ ద్వారా ఏన్కూరు ఎన్నెస్పీ కెనాల్‌లోకి నీటి తరలింపునకు ఈ కాల్వ నిర్మించారు. ఈమేరకు బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ కెనాల్ వద్ద గోదావరి జలాలు విడుదల చేసి పూజలు నిర్వహిస్తారు.
సీతారామ కాల్వల్లో ‘గోదావరి’ పరవళ్లు
Comments
Please login to add a commentAdd a comment