వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి
వైరారూరల్: వడగాలులు వీస్తున్నందున ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో మంగళవారం ఆమె ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యాన పనివేళల్లో మార్పులు చేయాలని ఆధికారులను ఆదేశించారు. పని ప్రదేశాల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలల్లో అందుతున్న సేవలపై ఆమె కూలీలకు అవగాహన కల్పించారు. ఏపీఓ అనురాధ, ఉద్యోగులు పాల్గొన్నారు.
నైపుణ్య శిక్షణకు ప్రణాళిక
ఖమ్మం సహకారనగర్: నైపుణ్య శిక్షణ అమలుకు ప్రణాళిక రూపొందించాలని అదనపు కలెక్టర్ శ్రీజ సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్‌నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్(సంకల్ప్) ద్వారా కళాశాలల్లో నైపుణ్య శిక్షణపై సమీక్షించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో యువతకు శిక్షణ ఇప్పిస్తే తక్షణ ఉపాధి లభిస్తుందన్నారు. జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఎండాకాలం సెలవులు రాగానే నెల పాటు శిక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, కార్పొరేట్ షాపింగ్ మాల్స్‌లో అమ్మకానికి కూరగాయలు, పూల పెంపకాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. జిల్లా ఉపాధి అధికారి ఎన్.మాధవి, వివిధ శాఖల అధికారులు కె.సత్యనారాయణ, జ్యోతి, నవీన్‌బాబు, పురంధర్, వి.విజేత, సీతారాం తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ
Comments
Please login to add a commentAdd a comment