అందుబాటులోకి డీసీసీబీ క్యూఆర్ కోడ్ సేవలు
ఖమ్మంవ్యవసాయం: ఖాతాదారులు, వినియోగదారుల సౌకర్యార్థం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) క్యూఆర్(క్విక్ రెస్పాన్స్) కోడ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సేవలను మంగళవారం ఖమ్మంలోని ప్రధాన కార్యాలయంలో చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. బ్యాంకు ప్రణాళిక, అభివృద్ధి విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ విభాగం ద్వారా సదుపాయాల కల్ప న, అవసరమైన సేవలను ప్రవేశపెడతామని.. ఇందులో భాగంగానే క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. నగదు రహిత లావాదేవీ లను ప్రోత్సహించేలా అమలుచేస్తున్న ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాలకవర్గ సభ్యులు, సీఈఓ ఎన్.వెంకట ఆదిత్య, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment