
సెర్ప్‌లో మెప్మా విలీనం
● ఒకే గొడుగు కిందకు మహిళా సంఘాల నిర్వహణ ● మహిళల అభివృద్ధే లక్ష్యంగా కీలక నిర్ణయాలు
ఖమ్మంమయూరిసెంటర్: మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ లక్ష్యమంటూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల అమలులో స్థానం కల్పిస్తోంది. ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద రూపొందించిన పాలసీ – 2025లో భాగంగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గ్రామీణ ప్రాంత మహిళలకు, మెప్మా ద్వారా పట్టణ ప్రాంత మహిళలకు బ్యాంకుల ద్వారా లింకేజీ రుణాలు ఇప్పించి ఆర్టీసీకి అద్దె బస్సుల కొనుగోలు, క్యాంటీన్ల ఏర్పాటు వంటి అవకాశాలతో అధికారులు తోడ్పాటు అందిస్తున్నారు. అయితే, ఇటు డీఆర్‌డీఏ, అటు మెప్మా అమలు చేస్తున్న పథకాలు ఒకే విధంగా ఉండగా.. వాటి లక్ష్యాలు కూడా ఒకటే. ఈ లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకోవడం, పర్యవేక్షణ సులువు చేసేలా రెండు శాఖలను ఒకే గొడుకు కిందకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యాన జిల్లాలో డీఆర్‌డీఏ, మెప్మాను విలీనం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా పరిధిలోని మహిళా సంఘాలు, సభ్యుల వివరాలను సేకరించారు.
వివరాలు ఇలా...
డీఆర్‌డీఏ మెప్మా
సమాఖ్యలు 1,018 05
స్వయం సహాయక
సంఘాలు 25,076 5,706
మొత్తం సభ్యులు 2,68,627 55,916
Comments
Please login to add a commentAdd a comment