
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
బోనకల్: ఏపీ నుంచి బోనకల్ మండలానికి రాత్రివేళల్లో ఇసుక రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ఇసుక తరలించే వాహనాల రాకపోకలతో రహదారులపై గుంతలు ఏర్పడుతుండగా, ఇష్టారాజ్యంగా వాహనాలు తీసుకెళ్తుండడంతో పొలాలు కూడా పాడవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇటీవల బోనకల్‌లోని రైతు మరీదు రామారావుకు చెందిన పొలంలో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో జేసీబీ సాయంతో ఆ ట్రాక్టర్‌ను తీసే క్రమాన వరిపంట పాడవడంతో నష్టపోయానని తెలిపారు. అంతేకాక పొలాలకు వెళ్లే దారులు కూడా గుంతలమయమవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
చింతకాని మండలం చిన్నమండవ ఏటి నుండి బోనకల్ మండలం రామాపురం గ్రామానికి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. చింతకాని మండలం తిమ్మినేనిపాలెంకు చెందిన పోపూరి శశి, గాదెల సరితకు చెందిన ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులు శుక్రవారం రాత్రి చేపట్టిన తనిఖీల్లో గుర్తించారు. ఈమేరకు ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లు వడ్డెపూడి నాగేశ్వరావు, షేక్ కబీతో పాటు యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు.
రోడ్లు, పంటలు పాడవుతున్నాయని
రైతుల ఆవేదన