
రైతులకు 11నంబర్లతో యూనికోడ్
తిరుమలాయపాలెం: ఆధార్ నంబర్ మాదిరిగానే ప్రతీ రైతుకు 11నంబర్లతో కూడిన యూనికోడ్ కేటాయించేలా కేంద్రప్రభుత్వం చేపడుతున్న రిజిస్ట్రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసిరి పుల్లయ్య సూచించారు. తిరుమలాయపాలెం రైతు వేదికలో ఫార్మర్ రిజిస్ట్రీపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతీ రైతు భూమి వివరాలు నమోదు చేశాక, రెవెన్యూ శాఖ వద్ద వివరాలు, ఆధార్ కార్డు అనుసంధానంతో ఫార్మర్ ఐడీ కేటాయిస్తారని తెలిపారు. ఆపై కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు సులువవుతుందని చెప్పారు. ఇందుకోసం రైతులు పూర్తి వివరాలతో వ్యవసాయ అధికారులను సంప్రదించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విధివిధానాలను మాస్టర్ ట్రెయినీ విజయచంద్ర వివరించారు. ఏడీఏ సరిత, ఏఓలు సీతారాంరెడ్డి, వాణి, రాధ, ఉమానగేష్ పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య