
వడదెబ్బతో వ్యక్తి మృతి
మధిర: ఎండవేడి కారణంగా వడదెబ్బకు గురైన ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంంలోని నిదానపురం గ్రామానికి చెందిన మేసిపోగు రత్తయ్య (33) సోమవారం మేకలను మేతకు తీసుకెళ్లాడు. అయితే, ఎండ కారణంగా అస్వస్థతకు గురై పొలం వద్ద పడిపోగా స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆటోలో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోగా రత్తయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉండగా, భార్య రమ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మధిర రూరల్ పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరొకరు మృతి
నేలకొండపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స చేయిస్తుండగా మరో వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని బోదులబండ వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న హరికిరణ్ (36), రాజ్‌బహుదూర్ (22), రాంజీలాల్ (23) ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టిన విషయం విదితమే. ఇందులో హరికిరణ్ ఆదివారం రాత్రి మృతి చెందగా, ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాంజీలాల్ సోమవారం మృతి చెందాడు. అలాగే, రాజవ్‌బహుదూర్ చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
పాముకాటుతో రైతు మృతి
తిరుమలాయపాలెం: వరిగడ్డి వామి వేస్తున్న ఓ రైతు పాముకాటుతో మృతి చెందాడు. మండలంలోని కుక్కలతండా గ్రామానికి చెందిన గుగులోత్ కిషన్ (38) సోమవారం ఉదయం వరిగడ్డి కట్టలతో వామి వేస్తున్నాడు. ఈ క్రమాన కాలిపై పాము కాటు వేయగా.. కుటుంబీకులు మరిపెడ బంగ్లాకు, అక్కడి నుంచి ఖమ్మం తరలించగా ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. కిషన్‌కు భార్య సుమలత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.