
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం
బోనకల్: నిరుపేద అయిన తనకు అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదనే ఆవేదనతో కాంగ్రెస్ నాయకుడు, మాజీ వైస్ ఎంపీపీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బోనకల్‌కు చెందిన మాజీ వైస్ ఎంపీపీ గుగులోత్ రమేశ్‌కు సొంత ఇల్లు కానీ, పొలం కానీ లేవు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ప్రకటించగా జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఆదివారం బోనకల్ మీదుగా మధిర వెళ్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు వినతిపత్రం అందించగా పరిశీలించి ఇల్లు మంజూరు చేస్తానని ఆయన తెలిపారు. ఇక సోమవారం గ్రామపంచాయతీ కార్యదర్శిని కలిసి జాబితాపై ఆరా తీశాడు. ఆ తర్వాత జీపీ ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా, స్థానికులు, పోలీసులు, సిబ్బంది ఆయనను అడ్డుకుని నచ్చజెప్పారు.
బాధితుడు కాంగ్రెస్ నేత, మాజీ వైస్ ఎపీపీ