
రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి
కారేపల్లి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు వైరా నియోజకవర్గం నుంచి భారీగా శ్రేణులు, ప్రజలు తరలివచ్చేలా నాయకులు చొరవ తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధు పిలుపునిచ్చారు. కారేపల్లి క్రాస్‌లోని మాజీ వార్డు సభ్యుడు సిద్ధంశెట్టి నాగయ్య నివాసంలో సోమవారం వారు బీఆర్‌ఎస్ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభకు పార్టీ శ్రేణులు, ప్రజల తరలింపు, సన్నద్ధతపై సూచనలు చేశారు. సమావేశంలో నాయకులు ముత్యాల సత్యనారాయణ, అడప పుల్లారావు, బానోతు రాందాస్, దాచేపల్లి కృష్ణారెడ్డి, మద్దెబోయిన సత్యనారాయణ, సిద్ధంశెట్టి పెద్దనాగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రవిచ్రంద, ఎమ్మెల్సీ మధు