
టీబీ బాధితులు పోషకాహారం తీసుకోవాలి
ఖమ్మంవైద్యవిభాగం: టీబీ బాధితులు పోషకాహారం తీసుకుంటూ మందులు సక్రమంగా వాడాలని డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి సూచించారు. జిల్లా ఆస్పత్రిలోని క్షయ వ్యాధి నివారణ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించిన ఆమె మె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్షయ బాధితుల గుర్తింపు, చికిత్సపై సిబ్బందికి సూచనలు చేశారు. అలాగే, బాధితులకు చికిత్సపై అవగాహన కల్పించారు. అనంతరం వాక్సినేషన్ రికార్డులు తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి వరికూటి సుబ్బారావుతో పలు అంశాలపై సమీక్షించారు. అంతేకాక ప్రధాన ఆస్పత్రి ప్రాంగణంలోని తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్, పీపీ యూనిట్లలో కూడా డీఎంహెచ్‌ఓ తనిఖీ చేశారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్‌కుమార్, పాథాలజిస్ట్ డాక్టర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గొల్లగూడెం అంగన్‌వాడీ కేంద్రంలో విద్యార్థుల కంటి పరీక్షల శిబిరాన్ని డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది డాక్టర్ రాధాకృష్ణ, అబ్దుల్ అలీం తదితరులు పాల్గొన్నారు.