
మహిళ మెడలో గొలుసు చోరీ
వైరా: స్థానిక వాసవీ కల్యాణ మండపం సమీపంలో శుక్రవారం సాయంత్రం ఓ మహిళ మెడలో నుంచి బంగారపు గొలుసును దుండగుడు చోరీ చేశాడు. పోలీసులు, బాధిత మహిళ కథనం ప్రకారం.. వైరాకు చెందిన మిట్టపల్లి వెంకటలక్ష్మి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్రవాహనంపై హెల్మెట్, మాస్క్ ధరించి అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని యువకుడు మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారపు గొలుసును లాక్కొని వెళ్లాడు. మహిళ కేకలు వేయగా స్థానికులు ఘటనా స్థలానికి చేరకుని పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ రెహమాన్ కల్యాణ మండపంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. ద్విచక్రవాహనానికి నంబర్ ప్లేట్ లేకపోవడం, చెయిన్ స్నాచర్ షార్ట్ మీద ఉన్నట్లు గుర్తించారు. 25 ఏళ్లలోపు వయసు ఉంటుందని అంచనా వేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఖమ్మం వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.